BREAKING
thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు
Date of Publish : 26 September 2026, 07:39 am
Posted by : ADARI RAMA PRASAD

కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
26 Sep, 2026 - 07:39 AM
14 వీక్షణలు

మునగపాక, సెప్టెంబర్ 25: కీటకజనిత వ్యాధులపై వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి కే. వరహాలదొర సూచించారు. శుక్రవారం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెదపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని ఆయన ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ ఏజే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి వారం డ్రైడే పాటించడం ద్వారా కీటకజనిత వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు వివరించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

అనంతరం పెదపాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా మలేరియా అధికారి మలేరియా రికార్డులను పరిశీలించారు. ప్రతి అనుమానిత మలేరియా కేసును ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో మలేరియా కార్యాలయ విస్తరణ అధికారి పీజేఎంఆర్‌పీ నాయుడు, హెల్త్ సూపర్వైజర్ ఆర్. నాగేశ్వరరావు, హరిపాలెం ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్. శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ఎంవీఏ మహేష్, వైద్య సిబ్బంది పీఎన్‌సీ అప్పారావు, వి. గుణలక్ష్మి, బి. నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు మణి, విజయ తదితరులు పాల్గొన్నారు.