BREAKING
thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ
Date of Publish : 06 October 2026, 06:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లైసెన్సులు ఉన్న బయో ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 06:15 PM
6 వీక్షణలు

విస్సన్నపేట: లైసెన్సులు ఉన్న బయో ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శశికళ ఎరువుల డీలర్లకు సూచించారు. విస్సన్నపేటలోని పలు ఎరువుల దుకాణాలను మంగళవారం సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శశికళ, మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు.

తనిఖీల్లో భాగంగా దుకాణాల్లో ఉన్న బయో ఉత్పత్తుల నిల్వలను పరిశీలించడంతో పాటు వాటికి సంబంధించిన కంపెనీ లైసెన్సులు, ఓ ఫారాలను అధికారులు తనిఖీ చేశారు. కంపెనీ ఆధారిత లైసెన్సులు, ఓ ఫారాలు లేని బయో ఉత్పత్తుల నిల్వలను గుర్తించి వాటి విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

లైసెన్సులు, అవసరమైన అనుమతులు లేకుండా బయో ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ కె. శశికళ హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన, అనుమతులు ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే అందేలా ఎరువుల డీలర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు.