BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఆపరేషన్ త్రిశూల్‌.. ప్రజల భద్రతే లక్ష్యం, ప్రతి ప్రాణం రక్షణే ధ్యేయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 08:06 PM
8 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా రూరల్ జోన్ పరిధిలో డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆధ్వర్యంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సమక్షంలో ఆపరేషన్ త్రిశూల్ ప్రారంభించారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ డ్రగ్స్‌ నియంత్రణ, మహిళలపై నేరాల కట్టడి, రహదారి ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే చేపట్టిన చర్యల ఫలితంగా రోడ్డు ప్రమాదాలు 50.4 శాతం, ఎన్‌డీపీఎస్‌ కేసులు 81.4 శాతం తగ్గినట్లు పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా మహిళలపై నేరాలు 14.8 శాతం, మొత్తం నేరాల సంఖ్య 16.5 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు.

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్‌ రహిత ప్రాంతాల నిర్మాణం, మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి నివారించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

జీరో డ్రగ్స్‌.. మహిళలపై అఘాయిత్యాలకు జీరో టాలరెన్స్‌.. సురక్షితమైన రోడ్లు అనే లక్ష్యంతో ఆపరేషన్ త్రిశూల్‌ను కొనసాగిస్తూ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.