BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 October 2026, 03:58 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా అవకాశం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Oct, 2026 - 03:58 PM
7 వీక్షణలు

జనసేన అధిష్ఠానానికి సీవీ గంగాధర్ కృతజ్ఞతలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు: స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయంలో భాగంగా పుంగనూరు అసెంబ్లీ కమిటీలో సమన్వయకర్తగా తనకు బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి సీవీ గంగాధర్ (చిన్నా రాయల్) కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు.

పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని సీవీ గంగాధర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి, కూటమి నాయకులతో సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని వెల్లడించారు.

తనతో పాటు నియోజకవర్గంలో పార్టీ పదవులు పొందిన నాయకులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పవన్ కల్యాణ్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తానని సీవీ గంగాధర్ (చిన్నా రాయల్) స్పష్టం చేశారు.