BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 09:31 PM
65 వీక్షణలు

మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము.అందులో ప్రధానంగా.. ఈ ‘పచ్చ కర్పూరం!’

మనం వెనుకటి రోజుల్లో పచ్చ కర్పూరం లడ్డూలలో, తిండి పదార్థాలలో అతి ముఖ్యంగా పండుగ సందర్భాలలో ప్రసాదాలలో మనం ఉపయోగించే వాళ్ళము. 

కానీ ఇప్పుడు ఎంత మంది ఆచరణలో పెట్టారు కనీసం ఇప్పుడు ఎంత మంది ఇంట్లో పచ్చ కర్పూరం ఉంది?

మీకు తెలుసా...?

మన పూర్వీకులు & ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి చిన్న మూలికలలో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది… అది మనకు అర్థం కాకపోతే సాధారణంగా వస్తువుగా కనిపిస్తుంది,అర్థమైతే అది అమూల్యమైన ఔషధం అవుతుంది.

అదే కోవకు చెందింది పచ్చ కర్పూరం మనం సాధారణంగా కేవలం పూజలో హారతి ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటాము కానీ ఇది…

మన శరీరాన్ని శుభ్రపరచే, గాలిని పవిత్రం చేసే,నరాలకు ఉత్తేజం ఇచ్చే, రోగాలను దూరం చేసే దివ్య శక్తి చిన్న పరిమాణంలోనే పెద్ద మార్పు తీసుకువచ్చే ఈ సహజ ఔషధం.

 పచ్చ కర్పూరం ఉపయోగాలు:

నోటి దుర్వాసనను వెంటనే తగ్గిస్తుంది.

జ్వరం, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది.

ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కండరాలు, నరాలకు ఉత్తేజం ఇస్తుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్, చిన్న చర్మ సమస్యలను తగ్గిస్తుంది.```

వాడే విధానం :

లవంగం పరిమాణంలో నోట్లో వేసుకొని చప్పరించాలి.

స్వీట్స్/లడ్డూలలో (1kgకి 2–3g) కలపాలి.

నువ్వుల నూనెలో కలిపి నొప్పులపై రాయాలి.

పసుపుతో కలిపి చర్మంపై రాయాలి.

పూజ గదిలో ఉంచితే గాలి శుభ్రం అవుతుంది.

స్వచ్ఛమైన పచ్చ కర్పూరం ఎలా గుర్తించాలి ?

కాల్చితే పూర్తిగా ఆవిరైపోతుంది. ఎలాంటి మిగులు ఉండదు.

తెల్లగా, చిన్న బిళ్లల రూపంలో ఉంటుంది.

సహజమైన గట్టి వాసన ఉంటుంది (కెమికల్ వాసనలా కాదు).

చేతిలో పట్టుకుంటే త్వరగా ఆవిరైపోతుంది.

నీటిలో వేసితే పూర్తిగా కరగకుండా మెల్లగా ఆవిరవుతుంది.```

నకిలీ (కెమికల్) కర్పూరం గుర్తులు 

కాల్చినప్పుడు మిగులు (బూడిద/పొడి) మిగులుతుంది.

వాసన చాలా కఠినంగా, అసహజంగా ఉంటుంది.

చాలా చవకగా లభిస్తుంది.