BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను శివాలయం కమిటీ కన్వీనర్ పుల్లారావు మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:43 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ కన్వీనర్ మైలవరపు పుల్లారావు అనారోగ్యంతో మంగళవారం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు.

పుల్లారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ కన్వీనర్‌గా కొనసాగుతూ గ్రామంలో నిర్వహించే పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గ్రామస్థులు తెలిపారు. ఆలయ అభివృద్ధి, కార్యక్రమాల నిర్వహణలో తనవంతు సహకారం అందించడంతో పాటు గ్రామంలో అందరితో సత్సంబంధాలు కొనసాగించేవారని పేర్కొన్నారు.

పుల్లారావు మృతి పట్ల పెనుగొలను గ్రామంలో పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పొట్టి నాగరాజు, కార్యదర్శి నాళ్ల వెంకట మోహన్ రావుతో పాటు శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, పలువురు గ్రామస్థులు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.