BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 06:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో జిల్లా పరిషత్ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:42 PM
27 వీక్షణలు

చైర్మన్‌గా ఆదూరి ఆంజనేయులు.. వైస్ చైర్మన్‌గా షేక్ షక్రూన్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలని గ్రామంలోని కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా ఆదూరి ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా షేక్ షక్రూన్ ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించడం, విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం, పాఠశాల అభివృద్ధితో పాటు మౌలిక వసతులను మెరుగుపరచడంపై చర్చించారు. పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

ఎన్నికైన చైర్మన్ ఆదూరి ఆంజనేయులు, వైస్ చైర్మన్ షేక్ షక్రూన్, కమిటీ సభ్యులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బొలగాని కోటేశ్వరరావు, మాజీ సహకార సంఘం అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు, కోట నాగేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు మోటకట్ల రాజారెడ్డి, కొండేటి వెంకటప్పయ్య, మెట్టగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు, మాజీ సర్పంచ్ సంగెపు నారాయణ, గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పంతంగి సాయికుమార్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బండారు గోపి తదితరులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.