BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్నాడులో హింసకు భారీ కుట్ర.. బాలకృష్ణ పీఏ అరెస్ట్.. 66 మందిపై కేసులు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:13 PM
10 వీక్షణలు

22 కార్లలో 100 మంది తరలింపు.. 60 కర్రలు, 4 కత్తులు స్వాధీనం పల్నాడు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రత్యర్థి వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆధిపత్యం చెలాయించేందుకు భారీగా జనాన్ని, మారణాయుధాలను సమీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు, స్థానిక టీడీపీ నేత పావులూరి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా తిమ్మాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ప్రత్యర్థి వర్గాన్ని బెదిరించేందుకు శ్రీనివాసరావు వర్గీయులు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా గుంటూరు నుంచి సుమారు 100 మందిని 22 కార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామానికి తరలించినట్లు తెలిపారు. గ్రామంలోని ఓ కంపెనీలో వారికి మద్యం, భోజన వసతి కల్పించడంతో పాటు, కొందరికి కర్రలు, కత్తులు అందించి సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాలను అడ్డుకున్నారు. ఈ తనిఖీల్లో 60 కర్రలు, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీలోని అంతర్గత వర్గ విభేదాలే ఈ పరిణామాలకు ప్రధాన కారణమని ఏఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనతో సంబంధం ఉన్న పరారీలో ఉన్న మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం పల్నాడు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.