BREAKING
thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం.. తెలంగాణకు వాతావరణ హెచ్చరికలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
70 వీక్షణలు

అల్పపీడన ప్రభావంతో మారనున్న వాతావరణ పరిస్థితులు

హైదరాబాద్‌, ఆగస్టు 18:

జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తెలంగాణ వాతావరణంపై కనిపిస్తోంది. రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర, తూర్పు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి సమయంలో ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.

అలాగే మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం కొనసాగుతుందని అంచనా. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

హైదరాబాద్‌లో సాయంత్రం వర్షపు జల్లులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.