BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 29 September 2026, 08:06 am
Posted by : THALLAPALLI LAKSHMANA

రామాపురంలో నేడు పల్లె పండుగ 3.0

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
29 Sep, 2026 - 08:06 AM
16 వీక్షణలు

నెల్లూరు: వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి రామాపురం వేదిక కానుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించే మిషన్ కర్మయోగి ప్రాంతీయ వర్క్‌షాప్కు హాజరుకానున్నారు. అనంతరం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లాకు బయలుదేరుతారు. తాజా పర్యటన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:15 గంటలకు రామాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

అనంతరం కాకోల్లువారిపల్లిలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలించి, ఉపాధి హామీ కూలీలతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:05 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు రామాపురంలో జరిగే ప్రధాన పల్లె పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

పల్లె పండుగ 3.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రహదారులు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రెయిన్లు, ఉద్యాన పంటలు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు తదితర మౌలిక వసతుల పనులు చేపట్టనున్నారు. మొత్తం రూ.11,085 కోట్ల విలువైన పనులను చేపట్టనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

సాయంత్రం 5:30 గంటలకు రామాపురం నుంచి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు చేసింది.