BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 29 September 2026, 08:03 am
Posted by : THALLAPALLI LAKSHMANA

ఉదయగిరిలో నేడు పల్లె పండుగ 3.0కు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
29 Sep, 2026 - 08:03 AM
20 వీక్షణలు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి మంగళవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

పల్లె పండుగ 3.0లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర మౌలిక వసతుల పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాడి రైతులకు మద్దతుగా రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాల నిర్మాణం, రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి, రూ.110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు. మరో రూ.200 🎂కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పల్లె పండుగ 3.0 కింద చేపట్టనున్న మొత్తం పనులకు కేంద్రం నుంచి రూ.5,391 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.5,694 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు అధికారిక వివరాలను ఉటంకిస్తూ వార్తా నివేదికలు పేర్కొన్నాయి.

విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్

పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

రామాపురంలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే సభా ప్రాంగణం, పార్కింగ్, భద్రత, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లను పూర్తి చేసింది.