లింగపాలెంలో ఘనంగా పల్లె పండుగ కార్యక్రమం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ దిబ్బగూడెం గ్రామంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్థానిక దళిత తెలుగుదేశం పార్టీ నాయకుడు అసిలేటి అజయ్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.