BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 28 September 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అకాల వర్షంతో బొప్పాయి పంటకు తీవ్ర నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 06:23 PM
52 వీక్షణలు

రామచంద్రాపురంలో 100 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతుల ఆవేదన

ఎ.కొండూరు, సెప్టెంబరు 28: అకాల వర్షాలు బొప్పాయి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామం, పరిసర ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి పంట వర్షాలకు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. పంట కోతకు వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో చెట్లు, కాయలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో రైతులు ఏటా వందల ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇక్కడి బొప్పాయికి ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్‌ ఉందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా పంట సాగు చేసి దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎకరాకు సుమారు రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పెట్టుబడులు నీటిపాలయ్యాయని వాపోయారు.

అధికారుల పరిశీలన

వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి పంటను సోమవారం వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉద్యానవనశాఖ అధికారుల ఆదేశాల మేరకు పంట నష్టాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. దెబ్బతిన్న పంటకు సంబంధించిన ఫొటోలను ఉద్యానవనశాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు రైతులకు వివరించారు. నష్టాన్ని మరింత సమగ్రంగా అంచనా వేసేందుకు ఉద్యానవనశాఖ అధికారులు మరోసారి గ్రామానికి వచ్చి పరిశీలన చేస్తారని తెలిపారు.

పరిహారం అందించాలని విజ్ఞప్తి

పంట చేతికందే సమయంలో వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని బొప్పాయి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని సమగ్రంగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు.