BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 15 May 2026, 04:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:30 PM
163 వీక్షణలు

ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సై సురేష్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పెళ్లైన విషయం దాచిపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా కానిస్టేబుల్‌కు దగ్గరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

గుడిలో బొట్టు పెట్టి “మనిద్దరికీ పెళ్లైంది” అంటూ నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. తర్వాత అసలు విషయం బయటపడటంతో మహిళా కానిస్టేబుల్ షాక్‌కు గురైంది.

“భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటా” అంటూ రెండేళ్ల పాటు కాలయాపన చేసిన ఎస్సై, ఈలోపు ఆమె గర్భవతి కావడంతో మాయమాటలతో అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తర్వాత పెళ్లి విషయం అడిగితే “నేను ఎస్సై.. నిన్నెలా పెళ్లి చేసుకుంటా?” అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో బాధిత మహిళ ఏప్రిల్ 1న కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదైన విషయం తెలుసుకున్న ఎస్సై సురేష్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. నెలన్నర పాటు గాలించిన పోలీసులు చివరకు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో ఎస్సై సురేష్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.