తాగునీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా
తెలంగాణ
/
హైదరాబాద్
- తనిఖీల్లో నీటి వృథాను గుర్తించిన జలమండలి అధికారులు
- నీటిని పొదుపుగా వినియోగించాలి
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: తాగునీటిని వృథా చేసినందుకు హైదరాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి రూ.20,000 జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్‌లో నీటి వృథాను గుర్తించినట్లు సమాచారం.
భవిష్యత్తులో తాగునీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి అధికారులు హోటల్ యాజమాన్యానికి సూచించారు. నీటి వృథాకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు, వాణిజ్య సంస్థలు తాగునీటి ప్రాధాన్యాన్ని గుర్తించి నీటిని వృథా చేయకుండా వినియోగించాలని అధికారులు సూచించారు.