BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 06 April 2026, 07:46 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడం అభినందనీయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 07:46 PM
130 వీక్షణలు

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడం అభినందనీయం: మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఏప్రిల్ 6

నంద్యాల పట్టణంలో సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ  (ఎస్.హెచ్.జి.ఎస్) ప్రెసిడెంట్ సునీల్ కుమార్ మరియు 36 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ మరుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నంద్యాల రైతు బజార్‌ నందు ఏర్పాటు చేసిన కూరగాయలు మరియు నిత్యవసర వస్తువుల స్టాల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా, సొసైటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్   మాట్లాడుతూ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొనుగోలు చేసి, పట్టణ ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన, కల్తీ లేని వస్తువులను అందించాలనే సొసైటీ నిర్ణయం మరియు ప్రతి కొనుగోలు వస్తువులపై బహుమతులు అందించడం ఎంతో సాహసోపేతమైనది మరియు ప్రశంసనీయమైనదని తెలిపారు . వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఈ స్టాల్స్‌ను నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ నాణ్యమైన కూరగాయలను అందించేందుకు కృషి చేస్తున్న సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ ప్రయత్నానికి పట్టణ ప్రజలందరూ తమ మద్దతు తెలపాలని మంత్రి ఫరూక్ కోరారు.

ఈ కార్యక్రమంలో సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, 36వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్,మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తులసి రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మాజీ కౌన్సిలర్ నాగార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సుమలత , స్వామి నాయక్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమైక్య జనరల్ సెక్రటరీ సుధీర్, చంటి, సొసైటీ కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ట్రెజరర్ శివచంద్రుడు, చంద్ర బోస్ , సతీష్, రఘునాథ్ రెడ్డి , వెంకట రమణయ్య, సాయిరాం,  మరియు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.