ప్రమోషన్ పొందిన శ్రీనివాసరావుకు ఘన సన్మానం
తెలంగాణ
/
ఖమ్మం
మధిర: ఖమ్మం జిల్లా మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షాంపూరి శ్రీనివాసరావుకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
పోలీస్ శాఖలో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పదోన్నతి పొందిన శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, నాగవరప్పాడు మాజీ సర్పంచ్, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రామరాజు, మధిర రూరల్ ఎస్‌ఐ విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.