BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 09:47 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ముంపు సమస్యపై ఎంపీడీవోకు పెద్ద హరిజనవాడ వాసుల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
13 Nov, 2026 - 09:47 AM
25 వీక్షణలు

ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ఇబ్బందులు.. ముంపు నీటిని తొలగించాలని అధికారులకు ఎంపీడీవో ఆదేశాలు

ఆత్రేయపురం: మండలంలోని పెద్ద హరిజనవాడలో ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు గురువారం ఎంపీడీవో పీవీఆర్కే రాజుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తమ ఇళ్లలోకి నీరు చేరిందని, ఇప్పటివరకు ముంపు నీటిని తొలగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు తెలిపారు.

ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో అనారోగ్య సమస్యలు, వ్యాధుల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించి ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.

స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన ఎంపీడీవో పీవీఆర్కే రాజు స్వయంగా పెద్ద హరిజనవాడ ప్రాంతాన్ని సందర్శించి ముంపు పరిస్థితిని పరిశీలించారు. నిలిచిన నీటిని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ కార్యదర్శి, ఇతర సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.