BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 October 2026, 07:41 am
Posted by : MENDI SRINIVASARAO

జనసేన అడ్వైజర్ కమిటీలో పెంట శంకర్ రావుకు చోటు

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
10 Oct, 2026 - 07:41 AM
16 వీక్షణలు

కురుపాం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన అడ్వైజర్ కమిటీలో కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, శిఖబడి గ్రామానికి చెందిన పెంట శంకర్ రావుకు చోటు లభించింది. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసిన పెంట శంకర్ రావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

అడ్వైజర్ కమిటీలో మరోసారి అవకాశం లభించడంపై జియ్యమ్మవలస మండలానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన నాయకుడికి పార్టీలో బాధ్యత లభించడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పెంట శంకర్ రావు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జనసేన పార్టీ బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.