BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 01:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోణంగిలో వృద్ధురాలి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 01:13 PM
48 వీక్షణలు

డబ్బు దొంగిలించేందుకు ఇంట్లోకి చొరబడి ఘాతుకం.. సిమెంట్ ఇటుకతో తలపై పలుమార్లు దాడి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోణంగి గ్రామం పాత మాలపల్లి జెండా సెంటర్ సమీపంలో జరిగిన 66 ఏళ్ల వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు-I టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఏలూరు రూరల్ ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోణంగి గ్రామం పాత మాలపల్లి జెండా సెంటర్ సమీపంలో నివాసం ఉంటున్న సిగిరెడ్డి మరియమ్మ అలియాస్ కుంటమ్మ (66) ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా క్రైమ్ నంబర్ 216/2026 కింద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో హత్య జరిగినట్లు నిర్ధారణ కావడంతో కేసును భారతీయ న్యాయ సంహితలోని 103(1), 62, 305(ఎ) సెక్షన్లకు మార్చారు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన గూడపాటి అజయ్ (25)కు వృద్ధురాలి వద్ద డబ్బులు ఉన్నాయనే విషయం తెలిసినట్లు పోలీసులు తెలిపారు. వాటిని దొంగిలించాలనే ఉద్దేశంతో అక్టోబర్ 21వ తేదీ రాత్రి 11.30 నుంచి 12 గంటల మధ్య ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో నిద్రలేచిన మరియమ్మ కేకలు వేయడంతో, ఆమె తనను గుర్తించి ఇతరులకు చెబుతుందనే భయంతో ఇంట్లో ఉన్న సిమెంట్ ఇటుకతో ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి నేరానికి సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం నిందితుడు గూడపాటి అజయ్‌ను నవంబర్ 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఏలూరు-I టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఏలూరు రూరల్ ఎస్ఐ వి. వెంకటేశ్వరరావుతో పాటు ఏలూరు రూరల్, ఏలూరు-I టౌన్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది కీలకంగా సహకరించారు. వృద్ధురాలి హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో స్థానికంగా ఈ ఘటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.