BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులతో పోస్ట్‌కార్డుల కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 01:35 PM
10 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌కార్డులు రాయించి పోస్టుబాక్స్‌లో వేశారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు తనతల సురేష్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పోస్ట్‌కార్డులపై మోదీకి జన్మదిన శుభాకాంక్షలు రాశారు. ఢిల్లీ సెక్రటేరియట్ చిరునామాతో పోస్ట్‌కార్డులను పోస్టుబాక్స్‌లో వేశారు.

ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 75 వేల పోస్ట్‌కార్డుల ద్వారా విద్యార్థులతో శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు, అంబేద్కర్ గురుకులాల్లోని విద్యార్థులకు గతంలో విస్తృతంగా వినియోగించిన పోస్ట్‌కార్డు, పోస్టుబాక్స్ వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కొనసాగిన ప్రస్థానం, ప్రభుత్వ విధానాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, విద్యార్థులకు అందుతున్న ప్రోత్సాహకాలు, ఉన్నత విద్య కోసం అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ప్రస్తుత సాంకేతిక రంగంలో విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం దూరదర్శన్, రేడియో ద్వారా ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో విద్యార్థులకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవాలని సూచించారు.

పోస్ట్‌కార్డులపై విద్యార్థులు ‘హ్యాపీ బర్త్‌డే టు శ్రీ నరేంద్ర మోదీ జీ’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్టెం శ్రీనివాసరావు, కే. బాబ్జి, చనుబండ పోస్టాఫీస్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ హరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు ఆర్‌బీఎస్ శోభన్ బాబు, పి. వీరకోటి, వి. లీలాకుమారి, డి. నాగమణి, డి. సుజాత, పి. రత్తయ్య, జి. కుమారి, ఎం. రాజు, బి. దుర్గాభవాని, కె. లంకేశ్వరమ్మ, కె. అజయ్ బాబుతో పాటు పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.