BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానం.. ఆరుగురు విదేశీయులు మృతి

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Nov, 2026 - 04:47 PM
13 వీక్షణలు

డిగోస్ సిటీలో ఘటన.. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు

ఫిలిప్పీన్స్ (ఎన్ టుడే న్యూస్):

ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దవావో డెల్ సుర్ ప్రావిన్స్ పరిధిలోని డిగోస్ సిటీలో ఆరుగురు విదేశీ ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమై, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు విదేశీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

విమానం కూలిపోయిన ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురి మృతిని ప్రాథమికంగా గుర్తించినప్పటికీ, ఈ ప్రమాదంలో మరెవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు విమానం కూలిపోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, ఇతర కారణాలా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.