BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతి చేతికి పని.. ప్రతి కుటుంబానికి భరోసా అందించడమే

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 05:18 PM
3 వీక్షణలు

ప్రతి చేతికి పని.. ప్రతి కుటుంబానికి భరోసా అందించడమే ‘వీబీ జీ రామ్ జీ’ లక్ష్యం మోరంపూడి శ్రీనివాసరావు 

చనుబండలో ప్రారంభ గ్రామసభ నిర్వహణ

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం స్వర్ణ గ్రామం–1 వద్ద ‘వీబీ జీ రామ్ జీ’ పథకానికి సంబంధించి ప్రారంభ గ్రామసభ నిర్వహించారు. చనుబండ పీఏసీఎస్‌ చైర్మన్‌, నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా, పంచాయతీ కార్యదర్శి నాగప్రసాద్‌ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి చేతికి పని, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంతోషం అందించడమే ‘వీబీ జీ రామ్ జీ’ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధి కూలీల జీవనోపాధికి తోడ్పడటంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శి నాగప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన ఉపాధి పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ఏ), టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీఏ)లకు సూచించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏ, టీఏలు కూడా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, కందుల కృష్ణ, బుర్రి శ్రీకర్‌, నెక్కకళపు వెంకటేశ్వరరావు, మోదుగు ముత్తయ్య, విస్సంపల్లి రాజా, స్వర్ణ గ్రామం–2 పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ, టీఏ కృష్ణ, ఎఫ్‌ఏ తాతయ్యబాబు, మోరంపూడి రమేష్‌, బొట్టు దుర్గారావు, సచివాలయ సిబ్బంది, వీబీఎంకే సభ్యులు, ఉపాధి కూలీలు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.