BREAKING
thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు
Date of Publish : 26 September 2026, 07:37 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రజాసేవే రాజకీయాల లక్ష్యం కావాలి: జగదీష్ రాజు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Sep, 2026 - 07:37 AM
5 వీక్షణలు

పుంగనూరు, సెప్టెంబర్ 25: ప్రజాసేవే రాజకీయాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ రాజు అన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని 19వ వార్డులో ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ.. 1916 సెప్టెంబర్ 25న జన్మించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని అన్నారు. భారతీయ జనసంఘ్‌ను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాజకీయాలను కేవలం అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం వినియోగించాలనే ఆలోచనను ఆయన ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం సమాజం, వ్యక్తి, దేశ అభివృద్ధిని సమగ్ర దృక్పథంతో చూడాలని సూచిస్తుందని జగదీష్ రాజు పేర్కొన్నారు. ఈ ఆలోచనా విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సమాజ సంక్షేమం, దేశ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు గర్వకారణమని పేర్కొంటూ, ఆయన ఆలోచనలు ప్రజలకు చేరేలా కార్యక్రమాలు కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు.

కార్యక్రమంలో రాజా జెట్టి, పెద్దమఠం బాబు, టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, ఆరోపల్లె వెంకటరెడ్డి, రమేష్, వెంకటేష్, దిలీప్, నారాయణ రాజు, భాస్కర్, గిరిధర్, శివ, శ్యామల, మోహన, ప్రభాకర్ రావు (ప్రభు), మనోజ్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.