BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 08 October 2026, 04:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టు అక్రమం.. కేసులు ఎత్తివేయాలి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Oct, 2026 - 04:16 PM
214 వీక్షణలు

ఖమ్మంలో ఇండియా కూటమి భారీ నిరసన

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్

ఖమ్మం/మధిర, అక్టోబర్ 8: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఖమ్మంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితర పక్షాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత రామనాథంతో పాటు పలువురు నేతలు నిరసనలో భాగస్వామ్యమయ్యారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ఎన్నికల సంఘం ఏకపక్ష విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, ప్రక్రియలో తొలగించబడినట్లు పేర్కొంటున్న ఓట్లను పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని కోరారు. ఓటరు జాబితాకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదే ఆందోళనలో భాగంగా ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఎంపీలను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓటరు హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై తమ ఆందోళనలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టు చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.