BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రంగాపురం వద్ద పులి పట్టుబడిందంటూ తప్పుడు ప్రచారం.. నమ్మవద్దని అటవీశాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 06:42 AM
54 వీక్షణలు

సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం

ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 20: రెడ్డిగూడెం మండలం రంగాపురం సమీపంలో పులి పట్టుబడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. కాలువ వద్ద నీరు తాగుతున్న సమయంలో పులిని పట్టుకున్నారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. పులి పట్టుబడినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అటువంటి ఘటన ఏదైనా చోటుచేసుకుంటే అటవీశాఖ తరఫున అధికారికంగా మీడియాకు సమాచారం అందజేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల కారణంగా ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి నిర్ధారణ లేని వీడియోలు, ఫొటోలు, వార్తలను ఇతరులకు పంపించడం ద్వారా వదంతులు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. బాధ్యతారహితంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని భావించకుండా, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు. పులి సంచారానికి సంబంధించిన సమాచారం తెలిసినా, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా స్వయంగా దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా వదంతులకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశా

రు.