BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు.. వేసవిలో తాగునీటి కష్టాలు తప్పవా!

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:56 AM
19 వీక్షణలు

శ్రీశైలం: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహాలు నిలిచిపోవడంతో జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు భవిష్యత్తు అవసరాలకు సరిపోతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 48.57 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 829.10 అడుగులకు పడిపోయింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే 3.03 టీఎంసీల నీరు తగ్గడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలు తీర్చేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న వేసవిలో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు పెరిగే సమయంలో జలాశయంలో నిల్వలు మరింత తగ్గితే ప్రజలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వర్షాలు కురిసే వరకు అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ఎగువ ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపైనే శ్రీశైలం జలాశయం భవిష్యత్తు నీటి నిల్వలు ఆధారపడి ఉన్నాయి.