BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:41 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

కొత్తపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
07 Nov, 2026 - 09:41 AM
32 వీక్షణలు

రెండు కౌంటింగ్ కేంద్రాల్లో ఏడు మండలాల ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో

కొత్తపేట (ఎన్ టుడే న్యూస్):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును కొత్తపేటలోని రెండు వేర్వేరు కేంద్రాల్లో శనివారం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం మండలాల ఓట్ల లెక్కింపును కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. అదేవిధంగా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల ఓట్ల లెక్కింపును కొత్తపేటలోని వి.కె.వి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జి.వి.వి. సత్యనారాయణ శుక్రవారం అధికారులతో కలిసి రెండు కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు, కొత్తపేట ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు, కొత్తపేట మండల సర్వేయర్, అంబాజీపేట మండల సర్వేయర్, కొత్తపేట ఎంఆర్ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.