రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ రాములు
మంచిర్యాల: జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను తహసీల్దార్ కృష్ణతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. చాకెపల్లి గ్రామంలో రీ-సర్వే పనులు సజావుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రీ-సర్వే పనులను నిబంధనలకు అనుగుణంగా, ఖచ్చితత్వంతో, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగం పెంచాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని ఆదేశించారు.
రీ-సర్వే కార్యక్రమానికి గ్రామ రైతులు సహకరిస్తున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇదే విధంగా అధికారులు, సిబ్బందికి రైతులు సహకరిస్తూ రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రమేష్, సర్వేయర్ వసంతరావు, జీపీఓ శివకుమార్, చైన్‌మెన్ రమేష్, మాజీ ఎంపీటీసీ మహేంద