BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 05:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 05:07 PM
23 వీక్షణలు

భూమిని ఖాళీగా వదలొద్దు.. రబీ డ్రై సోయింగ్‌తో నేలలో సూక్ష్మజీవుల సంరక్షణ నేల ఆరోగ్యం, సారవంతం పెంపునకు ఆర్‌డీఎస్ విధానం దోహదం

రెడ్డిగూడెం, నవంబర్ 20: రబీ సీజన్‌లో వరి కోతలు పూర్తయిన తర్వాత భూములను ఖాళీగా వదిలేయకుండా రబీ డ్రై సోయింగ్ (ఆర్‌డీఎస్) విధానాన్ని రైతులు ఆచరించాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పవన్ సూచించారు. భూమిపై పచ్చదనాన్ని కొనసాగించడం ద్వారా నేలలోని సూక్ష్మజీవులను సంరక్షించడంతోపాటు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమలు చేస్తున్న ఈ నూతన విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన రైతు గురిజాల వెంకటరత్నం తన ఎకరం పొలంలో వరి పంట కోత దశకు చేరుకున్న సమయంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరావు సూచనల మేరకు రబీ డ్రై సోయింగ్ విత్తనాలను చల్లించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పవన్ మాట్లాడుతూ.. సాధారణంగా వరి కోతల అనంతరం పొలాలను ఖాళీగా వదిలేయడం వల్ల సూర్యకిరణాలు నేరుగా నేలపై పడి భూమి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. దీనివల్ల నేలలో నివసించే సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణం తగ్గుతుందని పేర్కొన్నారు. రబీ డ్రై సోయింగ్ విధానంలో విత్తనాలు చల్లడం ద్వారా పొలంలో పచ్చదనాన్ని కొనసాగించవచ్చని, నేలపై మొక్కల కవచం ఏర్పడటంతో భూమి ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు దోహదపడుతుందని తెలిపారు. భూమిలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు కొనసాగేందుకు, నేల సారాన్ని కాపాడేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ సమతుల్యతకు కూడా మేలు జరుగుతుందని వివరించారు. రైతులు కేవలం పంట దిగుబడిపైనే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపైనా దృష్టి సారించాలని సూచించారు. రసాయనాలపై ఆధారపడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో సాగుకు అనుకూలమైన భూమిని అందించవచ్చని తెలిపారు. మండలంలోని రైతులందరూ రబీ డ్రై సోయింగ్ విధానంపై అవగాహన పెంచుకొని తమ పొలాల్లో ఆచరించాలని పవన్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్వాతి, వినీత పాల్గొన్నారు.