BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 23 September 2026, 10:03 am
Posted by : PARSIKA KAMESH

వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ పోలవరం
23 Sep, 2026 - 10:03 AM
103 వీక్షణలు

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి సమీపంలోని వాగు వద్ద భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలతో వాగులో నీటి ప్రవాహం పెరిగినట్లు స్థానికులు తెలిపారు. ఏడుగురాళ్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి తక్కువ ఎత్తులో ఉండటంతో పాటు వర్షపు నీటితో కొట్టుకొచ్చిన ఎండిన చెట్లు, ఇతర వ్యర్థాలు బ్రిడ్జిపై పేరుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు తెలిపారు. ఈ రహదారిలో మరో మూడు వాగులు కూడా ఉన్నాయని, వర్షాకాలంలో ఆయా ప్రాంతాల్లోనూ రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

వంతెనల నిర్మాణం, సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.

వర్షాల సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడుగురాళ్లపల్లి సమీపంలోని వాగుతో పాటు రహదారిలో ఉన్న ఇతర వాగుల వద్ద కూడా శాశ్వత వంతెనలు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజల సమస్యను అధికారులు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని, భవిష్యత్‌లో వర్షాల సమయంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.