సొసైటీ స్థలంలో షాపుల నిర్మాణానికి తీర్మానం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి: చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సర్వసభ్య సమావేశం మంగళవారం సహకార కార్యాలయ ఆవరణలో సంఘ చైర్మన్ తిరుమిల్లి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ముందు భాగంలో ఏలూరు రోడ్డు వైపు షాపులను నిర్మించాలని సభ్యులు తీర్మానించారు.
సంఘ కార్యదర్శి ఎం.వి.ఆర్.ఎల్. బాలకృష్ణ సొసైటీకి సంబంధించిన జమా ఖర్చుల నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. సమావేశంలో సంఘ డైరెక్టర్లు నందిపాం నాగేశ్వరరావు, చిక్కాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.