BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 12:27 pm
Posted by : RAJU POTHULA

ప్రభుత్వ భూమి పరిరక్షణకు రెవెన్యూ అధికారుల చర్యలు

తెలంగాణ
Reporter
Raju Pothula Nandipet Mandal
13 Nov, 2026 - 12:27 PM
38 వీక్షణలు

ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే స్థల పరిశీలన.. వారం రోజుల్లో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

నందిపేట: నందిపేట మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 686/4ఏలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని నందిపేట గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అధికారులను కోరారు. సుమారు రూ.50 కోట్ల విలువైన 2.05 గుంటల ప్రభుత్వ భూమికి సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, హైకోర్టు ఉత్తర్వుల ప్రతులను ట్రైనీ ఐఏఎస్‌, మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌కు అందజేసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా 1950 నుంచి 2016 వరకు భూమికి సంబంధించిన పహాణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను అధికారులకు సమర్పించారు. 1981, 2024 సంవత్సరాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన హైకోర్టు ఉత్తర్వుల ప్రతులను కూడా అందజేశారు. తప్పుడు ఇంటి నంబర్లు చూపించి ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

గ్రామ అభివృద్ధి కమిటీ ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోపే రెవెన్యూ అధికారులు స్పందించి సంబంధిత భూమి వద్దకు చేరుకున్నారు. స్థలాన్ని పరిశీలించి సరిహద్దులను గుర్తించారు. అనంతరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, జీపీఓ ఆధ్వర్యంలో భూమిని చదును చేయించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

అంతేకాకుండా వారం రోజుల్లోగా భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిపై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ వెల్లడించింది.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అవసరమైన చర్యలు కొనసాగించాలని కోరారు.