జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక క్రెడిట్ ప్లాన్ సమీక్ష
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
తెలంగాణ: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం (DCC/DLRC)లో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాల వివరాలు, లక్ష్యాల సాధన, రుణాల పంపిణీ పురోగతిపై సమావేశంలో చర్చించారు.
రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వర్గాలు, ఇతర అర్హత కలిగిన లబ్ధిదారులకు బ్యాంకింగ్ సేవలు, రుణ సదుపాయాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సమావేశంలో పేర్కొన్నారు.