BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 08:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుఫాన్ వేళ విద్యుత్ తీగలతో ప్రాణాలకు ముప్పు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 08:29 PM
52 వీక్షణలు

తెగిపడిన తీగలను తాకితే ప్రమాదమే.. అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ హెచ్చరిక

చాట్రాయి: తుఫాన్ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతినడం, చెట్లు విరిగిపడి విద్యుత్ లైన్లపై పడటం వంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరబాబు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.సంజయ్ హెచ్చరించారు.

తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలి:

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడి రోడ్లపై, పొలాల్లో, ఇళ్ల సమీపంలో పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలో విద్యుత్ ప్రవహించడం లేదని భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకరాదని స్పష్టం చేశారు. విద్యుత్ తీగ తెగిపడిన ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండటంతో పాటు ఇతరులు కూడా అక్కడికి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.

పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు:

తుఫాన్ సమయంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాలకు పిల్లలను వెళ్లనివ్వకూడదని సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నా సమాచారం ఇవ్వాలి:

బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగినా, తీగలు వేలాడుతున్నా, చెట్లు విద్యుత్ లైన్లపై పడినా ప్రజలు స్వయంగా వాటిని తొలగించే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా తడిచేతులతో విద్యుత్ పరికరాలను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారం:

విద్యుత్ తీగలు తెగిపడటం, స్తంభాలు దెబ్బతినడం, విద్యుత్ సరఫరాలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడటం వంటి ఘటనలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు ప్రజలు సంఘటనా స్థలానికి దూరంగా ఉండాలని సూచించారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తుఫాన్ సమయంలో విద్యుత్ వినియోగదారులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమాచారం కోసం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 9440817566, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 9440817567 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.