కాణిపాకం సమీపంలో రోడ్డు ప్రమాదం.. బాలిక మృతి
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం–చిగరపల్లి సమీపంలోని ఆరు లైన్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమిళనాడుకు తిరిగి వెళ్తున్న టాటా టియాగో కారు అదుపుతప్పి డివైడర్ సెంటర్ గోడను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ బాలిక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న కాణిపాకం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.