BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:19 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

H.M.Padu మండలం లో 2.25 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
26 Sep, 2026 - 07:19 PM
23 వీక్షణలు

కుటాగుండ్ల, నరవ గోపాలపురం, నీలకంఠాపురం, పాత మల్లవరం గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

హనుమంతునిపాడు: మండలంలోని పలు గ్రామాల్లో రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు హనుమంతునిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కుటాగుండ్ల గ్రామ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కుటాగుండ్లతో పాటు నరవ గోపాలపురం, నీలకంఠాపురం, పాత మల్లవరం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత వర్గాలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుందూరు నారాయణరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి గాయం తిరుపతిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.