ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి రూ.21 కోట్ల నిధులు.. భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 22: పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి రూ.21 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
నిధుల కేటాయింపుపై భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. HAM పథకం ద్వారా పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
రూ.21 కోట్ల నిధులతో ఆళ్లగడ్డ పట్టణంలో నాణ్యమైన రహదారులు, మెరుగైన వీధి దీపాలు, పార్కులు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.