నల్లమల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
కర్నూలు నుంచి కాకినాడకు వెళ్తున్న హైటెక్ ఆర్టీసీ బస్సు, దోర్నాల నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.