BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:09 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

రొంపిచర్ల ఎంపీపీగా శాఖమూరి వీరమ్మ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
20 Nov, 2026 - 07:09 PM
14 వీక్షణలు

వైస్ ఎంపీపీగా పులుకూరి జగ్గయ్య.. 18 మంది ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్వో శ్రీనివాసులు

రొంపిచర్ల, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

రొంపిచర్ల మండల పరిషత్ నూతన ఎంపీపీగా అలవాల ఎంపీటీసీ శాఖమూరి వీరమ్మ, వైస్ ఎంపీపీగా బుచ్చిపాపన్నపాలెం ఎంపీటీసీ పులుకూరి జగ్గయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరితో పాటు మండలంలోని 18 మంది ఎంపీటీసీలతో ఆర్వో కె. శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ.. మండలంలో 18 మంది ఎంపీటీసీలు టీడీపీ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం హర్షణీయమన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నూతన ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు.

అనంతరం ఎంపీపీగా శాఖమూరి వీరమ్మ, వైస్ ఎంపీపీగా పులుకూరి జగ్గయ్య ఎన్నికైనట్లు ప్రకటించగా, వారితో కూడా ఆర్వో శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, టీడీపీ నాయకులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె. మ్యాథ్యుబాబు, టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.