BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 20 June 2026, 08:32 am
Posted by : NTODAY NEWS

స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
20 Jun, 2026 - 08:32 AM
537 వీక్షణలు

సిరిపురంలో ఇటీవల అకాల మరణం చెందిన దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులను 2001-2002 పదవ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి పరామర్శించి, తమ ప్రియ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.1,11,111 (ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.... స్నేహం అంటే కేవలం కలిసి చదవడం మాత్రమే కాదని, కష్టకాలంలో తోడుగా నిలవడమే నిజమైన స్నేహమని వారు ఈ సందర్భంగా చాటిచెప్పారు.... భవిష్యత్తులో కూడా శ్రవణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు....

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తమ స్నేహితుడు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి చురుకుగా పాల్గొని ఉద్యమ స్పూర్తిని చాటుతూ జైలుకు సైతం వెళ్లారని గుర్తు చేసుకున్నారు.... అలాగే గ్రామ అభివృద్ధి, ప్రజా సేవల కోసం ఐదు సంవత్సరాల పాటు సిరిపురం ఉపసర్పంచిగా నిస్వార్థంగా పనిచేసి గ్రామ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.... అలాంటి వ్యక్తి అకాల మరణంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు....

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, గ్రామానికి విశిష్ట సేవలు అందించిన శ్రవణ్ కుమార్ రెడ్డి వంటి వ్యక్తుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు... ఆయన భార్యకు అర్హతలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.... సమాజం కోసం పనిచేసిన వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవడం ద్వారా సేవాభావానికి గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు....

దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, స్నేహితులు, పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.... ఆయన సేవలను గుర్తిస్తూ కుటుంబానికి భరోసా కల్పించడం ద్వారా ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను నెరవేర్చాలని కోరారు....

"స్నేహితుడు లేడు... కానీ అతని కుటుంబానికి మేమున్నాం. ప్రభుత్వం కూడా అండగా నిలవాలి" అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు....

2001 - 2002 పదవ తరగతి పూర్వ విద్యార్థులు... సిరిపురం