BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు బాలికొన్నత పాఠశాల విద్యార్థిని సంకీర్తనకు జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌లో రజత పతకం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 05:36 PM
32 వీక్షణలు

తిరువూరు, నవంబర్ 7: మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో తిరువూరు బాలికొన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్ 7వ తరగతి విద్యార్థిని కె. సంకీర్తన అద్భుత ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. జాతీయ స్థాయిలో తన క్రీడా నైపుణ్యాన్ని చాటుకుంటూ రజత పతకాన్ని కైవసం చేసుకున్న సంకీర్తన పాఠశాలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం సంకీర్తనను శాలువాతో ఘనంగా సత్కరించింది. ఆమె క్రీడా ప్రతిభను అభినందిస్తూ రూ.2,000 నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేసి ప్రోత్సహించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ సమానంగా రాణించాలని సూచించారు. సంకీర్తన సాధించిన విజయం పాఠశాలలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె విజయానికి కృషి చేసిన పీడీలను ప్రత్యేకంగా అభినందిస్తూ, సంకీర్తన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.