BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 30 April 2026, 07:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సూర్యాపేట జిల్లా – కోదాడలో నకిలీ సిగరెట్, కాఫీపొడి రాకెట్ గుట్టురట్టు

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:07 PM
136 వీక్షణలు

సూర్యాపేట జిల్లా – కోదాడలో నకిలీ సిగరెట్, కాఫీపొడి రాకెట్ గుట్టురట్టు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నకిలీ సిగరెట్‌లు, కాఫీపొడి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం నడిపిస్తూ కోదాడలో విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

పట్టణంలోని వెంకటేశ్వర నగర్‌లో CI శివశంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఈ దందా బయటపడింది. సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ప్యాకింగ్‌లు చేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.

కేసు నమోదు చేసి, ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.