BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 03:22 pm
Posted by : BOYA SWAMY

ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ భానుశ్రీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
11 Nov, 2026 - 03:22 PM
3 వీక్షణలు

ఉరుమడ్ల: భూగర్భజలాల సంరక్షణతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం సూచించారు. నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో వి.బి. రామ్‌జీ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంత నిర్మాణానికి బుధవారం సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో భూగర్భజలాలు అడుగంటుతున్న నేపథ్యంలో నీటి ప్రతి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాలుర వసతి గృహంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు నీటి సంరక్షణకు ఉపయోగపడేలా ఇంకుడు గుంత నిర్మాణ పనులను ప్రారంభించినట్లు వివరించారు. వసతి గృహ పరిసరాల్లో నీటి నిర్వహణ మెరుగుపడటానికి ఈ నిర్మాణం దోహదపడుతుందని పేర్కొన్నారు.

గ్రామంలో నీటి సంరక్షణకు సంబంధించిన పనులను ప్రోత్సహించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, ఐకేపీ ఏపీఎం శ్రీదేవి, సీసీ రమణ, పంచాయతీ కార్యదర్శి ఏలేందర్ రెడ్డి, వార్డు సభ్యుడు ఎలిమినేటి హరిప్రసాద్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.