ఉపాధ్యాయుడి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
ఉరుమడ్ల, సెప్టెంబరు 29: ఉరుమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సోమగాని సైదులు పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం హాజరై సైదులుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ కుటుంబానికి సమయం కేటాయించడంతో పాటు విద్యార్థుల అభివృద్ధి, భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పాఠశాలలో సైదులు అందించిన సేవలను అభినందించారు.
కార్యక్రమంలో పీఆర్‌టీయూ-టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం, ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, వెంకన్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, వార్డు సభ్యుడు ఎలిమినేటి హరీ ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు యాదయ్య, శిరీష, భవాని, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.