BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 02:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 02:56 PM
41 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండల, జిల్లా పరిషత్‌లలో కీలక పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 20వ తేదీన 28 జిల్లా పరిషత్‌లలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మండల పరిషత్‌లలో ఒక్కొక్కరు చొప్పున, జిల్లా పరిషత్‌లలో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎంపీపీలు, ఉపాధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఈ పరోక్ష ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పీఠాలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల్లో కసరత్తు ప్రారంభమైంది.