BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 29 September 2026, 08:22 am
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో బోల్తా పడిన స్కూల్ బస్సు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
29 Sep, 2026 - 08:22 AM
15 వీక్షణలు

తెలంగాణలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. 37 మంది విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

తమిళనాడులోని సేలం నుంచి 37 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లతో కర్నూలు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లి సమీపంలో బోల్తా పడింది.

సోమవారం ఉదయం 6.10 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు మానోపాడు ఎస్సై బి. స్వాతి వెల్లడించారు.

ప్రమాదంలో సుమారు 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికి తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన విద్యార్థులను పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని ఆర్టీసీ బస్సులో కర్నూలుకు పంపించారు.

అక్కడి నుంచి విద్యార్థులు, టీచర్లు తిరిగి సేలం చేరుకునేందుకు స్కూల్ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.