మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు
మునగపాక: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కమిటీ ఎన్నికలకు సుమారు 180 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరైనట్లు తెలిపారు. కమిటీ ఎన్నికల్లో సుమారు 15 మంది తల్లిదండ్రులు వివిధ పదవులకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు ఇతర సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఎన్నికల అనంతరం స్కూల్ కమిటీ చైర్మన్‌గా ఆడారి సూర్యచంద్ర రామారావు, వైస్ చైర్మన్‌గా బొడ్డేడ పావని ఎంపికైనట్లు తెలిపారు. ఇతర సభ్యులను కూడా కమిటీలో నియమించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ బొడ్డేడ అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.