BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 14 October 2026, 09:27 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
14 Oct, 2026 - 09:27 PM
8 వీక్షణలు

మీరట్, అక్టోబర్ 14: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మరణశిక్ష విధించింది. సెప్టెంబర్ 30న ఇద్దరినీ దోషులుగా నిర్ధారించిన కోర్టు, బుధవారం శిక్షను ఖరారు చేసింది.

నేరాన్ని వెలుగులోకి తెచ్చిన బ్లూ డ్రమ్
126 విచారణలు.. 22 మంది సాక్షులు

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, 2025 మార్చిలో సౌరభ్ రాజ్‌పుత్ హత్యకు గురయ్యాడు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, సిమెంట్‌, ఇసుకతో నింపిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ కేసు విచారణలో సుమారు 126 విచారణలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫున 22 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిశీలించింది. హత్యతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసిన నేరాలకు సంబంధించి ఇద్దరినీ దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, తాజాగా మరణశిక్ష విధించింది.

ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘బ్లూ డ్రమ్’ కేసులో శిక్షల దశ పూర్తయింది. అయితే మరణశిక్ష అమలుకు సంబంధించి తదుపరి న్యాయపరమైన ప్రక్రియలు ఉంటాయి.