BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 23 September 2026, 10:15 am
Posted by : PAMMI NAVEENKUMAR

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
23 Sep, 2026 - 10:15 AM
91 వీక్షణలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం సెప్టెంబర్ 23 రాత్రికి విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది.

ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి సుమారు 220 కిలోమీటర్ల తూర్పున, కళింగపట్నానికి సుమారు 140 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు IMD వెల్లడించింది. గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది.

ఏపీలో భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో సెప్టెంబర్ 23న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. సెప్టెంబర్ 24న కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

మత్స్యకారులకు హెచ్చరిక

సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఆంధ్ర తీరంలో గంటకు 25–30 నాట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, ఈదురుగాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది.

విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కళింగపట్నం, కాకినాడ తదితర ప్రధాన ఓడరేవుల్లో స్థానిక హెచ్చరిక సిగ్నల్ నంబర్–3 కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.


— Ntoday News